బాబు సిగ్గుతో తలదించుకోవాలి

  • చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశాడు
  • టీడీపీకి మెజారిటీ లేకపోయినా పోటీ పెట్టడం దారుణం
  • బాబు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుంది
  • జమ్మలమడుగులో ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లాః ఎన్నికలే జరగకూడని పరిస్థితులున్నా చంద్రబాబు ఎన్నికలు తీసుకురావడం సిగ్గుచేటని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైయస్సార్సీపీ గుర్తుపై గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ల కన్నా చాలా ఎక్కువగా ఉన్నారని వైయస్ జగన్ తెలిపారు. అటువంటి చోట టీడీపీ అదేపనిగా క్యాండెట్ లను పెట్టి.. వేరే పార్టీకి చెందిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లను ప్రలోభపెట్టి,  భయపెట్టి, కిడ్నాప్ లు చేసి ఎలక్షన్ లు నడుపుతున్నారంటే బాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో వైయస్ జగన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 

కడపలో మొత్తం 841మంది ఓటర్లుంటే అందులో 521మంది వైయస్సార్సీపీ గుర్తుపై గెలిచిన వాళ్లున్నారని, టీడీపీ గుర్తుపై గెలిచిన వాళ్లు కేవలం 305 మంది మాత్రమేనని చెప్పారు. మెజారిటీ ప్రతినిధులు వైయస్సార్సీపీకి ఉన్నా కూడ  బాబు పోటీపెట్టి పెట్టడం దారుణమన్నారు. కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను మీ డబ్బెంత, మీ విలువెంత అని వ్యక్తిత్వానికి లెక్కకట్టి కొనుగోలు చేస్తున్నారని, విననివాళ్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ముఖ్యమత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి, దాన్ని తూట్లు పొడుస్తూ అవహేళన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బాబు ఆధ్వర్యలో ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం బతుకుతుందంటే ముఖ్యమంత్రి  సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 

గతంలో ఎన్నడూ లేనివిధంగా కలెక్టర్ ఫోల్డ్ చేసిన బ్యాలెట్ పీవోకు చూపించి బాక్సులో వేయమంటున్నారని విలేకరులు వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ... కలెక్టర్ రూల్స్ అధిగమించి చేయకూడని పని చేస్తే మాత్రం ప్రజాస్వామ్యంలో ఓ అడుగు దిగజారినట్టేనని అన్నారు.  పైన దేవుడున్నాడు. ప్రజల గుండెల్లో ప్రేమ,  అభిమానం, మంచితనం ఇంకా బతికే ఉందని వైయస్ జగన్ అన్నారు. బాబు ఎన్ని కుయుక్తులు పన్నినా  చివరకు న్యాయమే గెలుస్తుందని వైయస్ జగన్ స్పష్టం చేశారు.  
Back to Top