ఇలాంటి రికార్డు బాబే బద్దలు కొట్టగలడు

  • చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ఉన్నప్రేమ రైతులపై లేదు
  • రైతులకు మద్దతు ధర పెంచడు
  • కాంట్రాక్టర్లకు మాత్రం అమాంతం ధరలు పెంచేస్తాడు
  • లోకేష్ ను టీడీపీ వాళ్లు లో క్యాష్ అంటున్నారు
  • రైతులను ఆదుకోకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం
  • ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్ జగన్
  • రెండ్రోజుల దీక్ష ముగింపు సందర్భంగా వైయస్ జగన్ ప్రసంగం
గుంటూరు: రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ ధర పెంచాలన్న ఉద్దేశంలేని చంద్రబాబు కాంట్రాక్టర్లకు మాత్రం అమాంతం ధరలు, అంచనాలు పెంచుతున్నారని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరులో రెండురోజుల రైతు దీక్షను విరమించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..  ప్రతి ప్రాజెక్టులోనూ విపరీతంగా ధరలు పెంచి ఎస్కలేషన్‌ను ఇస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఆర్టీసీ, కరెంటు చార్జీలను సైతం మూడుసార్లు చొప్పున పెంచేశారని గుర్తుచేశారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని చంద్రబాబు వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్తున్నారని, మరి అదే ద్రవ్యోల్బణం రైతుల విషయంలో వర్తించబోదా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచే విషయంలో ద్రవ్యోల్బణం గుర్తుకురాదా? అని నిలదీశారు. ఇక చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్‌ ప్రతి విషయంలోనూ డబ్బు తీసుకుంటున్నారని, ఆయన పేరు లోకేష్‌ కాదు లో‘క్యాష్‌’ అని టీడీపీ నేతలే అంటున్నారని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....

ఈ రోజు రైతు దీక్ష కార్యక్రమానికి దూరాన్ని, ఎండను సైతం లెక్క చేయకుండా,  మనం పడుతున్న బాధలను,  తినటానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, ప్రభుత్వ దష్టికి తీసుకువెళ్లి.. ప్రభుత్వ మెడలు వంచైనా సరే.. న్యాయం జరిపించుకోవాలని రైతు దీక్షకు వచ్చిన ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు ప్రతి సోదరునికి, స్నేహితునికి ఇక్కడున్న రైతు సోదరులందరికే గాక, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ పేరుపేరున  కృతజ్ఞతలు.

ఈ వేదిక సమీపంలోనే మిర్చియార్డు ఉంది. రైతుకు కష్టం కలుగుతుంటే, రైతు గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం వినాలి. రైతులు చెప్పేది వినకూడదు అన్నట్లు దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్న చంద్రబాబును ఏమనాలో అర్థం కావటంలేదు. 2015-16లో ఏ పంటకు గిట్టుబాటు రాని పరిస్థితి. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఐదువారాల క్రితం మిర్చి యార్డును తాను సందర్శించినప్పుడు ధర 6-7వేల మధ్య ఉందన్నారు. ఇవాళ 2-4వేల మధ్య రేటు ఉంది. ధర దారుణంగా పడిపోయింది. చంద్రబాబు ఎప్పుడు తన రికార్డులు తనే బ్రేక్ చేస్తున్నానని చెబుతారు.  దానికి ఏపీలో పడిపోతున్న సాగు విస్తీర్ణమే సాక్ష్యం.  ఏపీలో 13 జిల్లాల్లో బాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 
2014-15లో 40.96 లక్షల్లో  ఉండగా.. 2016-17కు 38.62 లక్షల హెక్టార్లకు పడిపోయింది, ఇంత గొప్ప రికార్డు చంద్రబాబు మాత్రమే బద్ధలు కొట్టగలరు.  రబీ పంటను గమనిస్తే 13 జిల్లాల ఏపీలో 27 లక్షల హెక్టార్లలో పంటలు వేసేవారు. బాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి  23.19 లక్షల హెక్టార్లలో ఉండగా..  2016-17లో  19.47 లక్షల హెక్టార్లకు పడిపోయింది. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా సాగు విస్తీర్ణం పడిపోయింది. ఇలాంటి రికార్డు ఒక్క చంద్రబాబు మాత్రమే బద్దలు కొట్టగలడు. బాబు రాకముందు సకాలంలో రైతులు రుణాలు తెచ్చుకునేవారు. బాబు ముఖ్యమంత్రి అయ్యాక.. రుణాలు తెచ్చుకోవటంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2015లో బ్యాంకులు రూ.50,212 కోట్లకు రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకొని కేవలం రూ.39,918 కోట్లు ఇవ్వటం జరిగింది. 2015-16లో రూ.83వేల కోట్లు రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని రూ.58,190 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు ఎక్కువ ఇప్పించాలని ఏ ముఖ్యమంత్త్రైనా ప్రయత్నిస్తారు, ఒక్క చంద్రబాబు తప్ప.  చంద్రబాబు నాయుడు రైతులకు రుణాలు ఇప్పించడు. కోటి 4లక్షల అకౌంట్లలో 40 లక్షల అకౌంట్లు ఓవర్ డ్యూ, నాన్ ఫెర్ఫార్మింగ్ అకౌంట్లుగా మారాయి.. ఇలా మారటానికి చంద్రబాబు విధానాలే కారణం. ఇలాంటివన్నీ చంద్రబాబు హాయంలోనే జరుగుతాయని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87,690 కోట్లకు పైగా రైతు రుణాలు ఉన్నాయి. ఎవ్వరూ రుణాలు కట్టొద్దని, బేషరుతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తీసుకు వస్తానని చంద్రబాబుఎన్నికల్లో  ఊదరగొట్టారు. రూ.87,690 కోట్ల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని బాబు చెప్పారు. అయితే ఈ రోజున18% అపరాధ వడ్డీని బ్యాంకులు రైతుల దగ్గర వసూలు చేస్తున్నాయి. 40వేల కోట్లే వడ్డీకి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.  బాబు రుణమాఫీకి సంవత్సరానికి 3వేల కోట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి రికార్డులు చంద్రబాబు మాత్రమే చేయగలడు. బాబు ముఖ్యమంత్రి అయ్యారు.. ఆయనతో పాటు కరువు వచ్చింది. వరుసగా మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కరువే కరువు.  చంద్రబాబు ఈ విధంగా తన రికార్డు తనే బద్దలు కొట్టుకోగలడు.  రైతుల మద్దతు ధర గురించి చంద్రబాబు ఏనాడూ పోరాడలేదు. చంద్రబాబు 9 సంవత్సరాల్లో వరిమీద కనీస మద్దతు ధర రూ.170లు మాత్రమే పెంచాడు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాడు.. రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.  ప్రియతమ నేత వైయస్ఆర్ హయాంలో వరి మద్దతు ధర రూ.530 నుంచి రూ.1030కి వెళ్లింది. మద్దతు ధర కోసం కేంద్రంపై ఆనాడు దివంగత నేత వైయస్ఆర్ ఒత్తిడి తీసుకువచ్చారు. బాబు వరి మీద మూడు సంవత్సరాల్లో 4%కూడా మద్దతు ధర పెంచలేదు. పత్తి కూడా,  రూ. 50, రూ. 60 మూడు సంవత్సరాల్లో పెంచారు.  సాధారణంగా ద్రవ్యోల్బణం 5% ఉంటుంది. దానికంటే తక్కువగా మద్దతు ధరలు పెరుగడం దారుణం.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారిశ్రామిక రంగం, సేవరంగం, పరిశోధన సంస్థలు తెలంగాణకు వెళ్లిపోవటం జరిగాయని వైయస్.జగన్ తెలిపారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోవటం జరిగిందన్నారు. దేశ జీడీపీలో వ్యవసాయరంగం 14% అయితే, ఉమ్మడి ఏపీలో 22% ఉండగా ఇప్పడు 27% పెరిగిందన్నారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి ప్రతి రైతుకు అండగా నిలబడాలని ఆలోచిస్తారన్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీ ఉందని, అయితే బాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో సాగు ఏరియా గణనీయంగా తగ్గిపోతోందని జగన్ గణాంకాలతో సహా వివరించారు. 

గ్రామాలకు గ్రామాలే వలసలు.. 
గ్రామాల్లో కరువు కన్నీరు...
పశుగ్రాసం ధర మండుతోంది.. 
పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదు

వర్షాభావం వల్ల లక్షల కొద్దీ హెక్టార్లలో సాగు తగ్గిపోతోందన్నారు. గ్రామాల్లో పశుగ్రాసం, నీటి కొరత ఎదుర్కొంటున్నారన్నారు. కరువుతో పక్క రాష్ట్రాల్లో పనుల కోసం వలసలు పోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఇంత దారుణంగా ఉన్నా చంద్రబాబుకు అస్సలు పట్టడం లేదని దుయ్యబట్టారు.  పంటలకు గిట్టుబాటు ధర లేక, తమ చేనుల్లో పండించిన పంటను రైతులు తగలబెట్టే పరిస్థితి కనిపిస్తోందని వైయస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కోత కోయటానికి, ట్రాన్స్ పోర్ట్ తీసుకురావటానికి రైతులకు భారీ ఖర్చు అవుతోందన్నారు. కనీసం ఇక్కడ పంటలు కొంటున్నారా అంటే.. అదీ లేదు. ఇచ్చేదేమో రూ.4వేలు మాత్రమే. రైతుకు అయ్యే ఖర్చు 2,500 నుంచి 4,000 అవుతోంది. మార్కెట్ యార్డులో పంటలు కొనేవాళ్లు లేరు. కోల్డ్ స్టోరేజీల్లో పంటలు నిల్వ ఉంచే పరిస్థితి లేదు. మళ్లీ రైతు వెనక్కి తీసుకువెళ్లాలంటే.. భారీ ఖర్చు అవుతోందని వైయస్ జగన్ అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పంటలు పారేసి నిరసన తెలుపుతుంటే ‘‘రైతుల్ని తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారని చంద్రబాబు సర్కార్ పై మండిపడ్డారు.  బాబుకు రైతులకు గిట్టుబాటు ధరలు పెంచాలన్న శ్రద్ధే లేదని, ఎస్కలేషన్ ఇచ్చి రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదని  జగన్ మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్స్ ఇస్తారని పోలవరం ప్రాజెక్టును 16వేల కోట్ల నుంచి 42వేల కోట్లకు పెంచుతారని, పట్టిసీమ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్స్ పెంచుతారన్నారు. టెంపరరీ సెక్రటేరియట్ కూడా చ.అ. 10వేలకు పైగా ఇస్తారని,  ప్రజలకు సంబంధించి వ్యవహారంలో మాత్రం చంద్రబాబుకు మేలు చేయాలనే ఆలోచన ఉండదని,  అదే కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ ఇస్తారని జగన్ ఫైర్ అయ్యారు.  ఎందుకు కాంట్రాక్టర్లకు ఇస్తారని అడిగితే.. వచ్చీ రానీ ఇంగ్లీషులో ఇన్ ప్లుయేషన్ (ద్రవ్యోల్భణం) అంటారని, అదే ద్రవ్యవోల్బణం.. ఎస్సీ, ఎస్టీల మెస్ ఛార్జీల పెంపుపై ఉండదా? రైతులకు ఉండదా? అని జగన్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల కోసం 2014 నుంచి చంద్రబాబు నోటి నుంచి ఈ మాటలు వస్తున్నాయన్నారు. సొంత జేబుల్లోకి డబ్బులు వస్తాయంటే చంద్రబాబుకు ద్రవ్యోల్బణం గుర్తుకు వస్తోందన్నారు. ఈ మధ్య చంద్రబాబు కుమారుడు గురించి లోకేశ్ కాదని.. లో ‘క్యాష్’ అని టీడీపీ వాళ్లే అంటున్నారని జగన్ తెలిపారు. బాబుకు రైతుల మీద ప్రేమ ఉండదు.. ప్రజల మీద ప్రేమ ఉండదు.. కాంట్రాక్టర్ల మీద మాత్రమే ప్రేమ ఉంటుందన్నారు. 

ప్రభుత్వమే పంటలు కొనాలి. 
మార్కెఫెడ్ ను రంగంలో దించాలి. 
ధర 8వేలలోపు ఉంటేనే రూ.1500 ఇస్తారా?

ఇవాళ ధరల గురించి చూస్తే పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయని వైయస్ జగన్ అన్నారు. మిర్చి 92 లక్షల క్వింటాళ్లు పంట పండితే .. ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించితే 8వేల చొప్పన 50 లక్షల క్వింటాళ్లు కొంటారని.. అప్పుడు ప్రైవేటు వ్యాపారుల్లో చలనం వచ్చి ధర పెరుగుతుందన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఇదన్నారు. ఎన్నికలప్పుడు స్థిరీకరణ నిధి తీసుకొచ్చి.. రైతుల్ని ఆదుకుంటామన్నారు. మూడేళ్లు అయింది. ఈ రోజున వ్యాపారులకు మేలు చేసే విధంగా 1500 బోనస్ ఇస్తామన్నారని, 1500లు కూడా 8వేల లోపు ఉంటేనే ఇస్తారని చెప్పటంపై జగన్ మండిపడ్డారు. దీంతో వ్యాపారులు కూడా ప్రభుత్వం బోనస్ ఇస్తోందని ధరను తగ్గిస్తున్నారన్నారు. కోత కోసి ఇక్కడకు తెచ్చి.. 70వేల క్వింటాళ్లకు మాత్రమే రూ.1500లు ఇచ్చారట. 
నెల్లూరులో రబీలో వరి పండిస్తున్నారు. గతేడాది క్వింటాలు రూ.1650లు ఉన్న వరిని ఇప్పుడు రూ.1400, రూ1350కూడా కొనే నాథుడు లేడు.  శ్రీ కాకుళంలో వరి వేసిన రైతులు ధర్నాలు చేసే పరిస్థితి కల్పించారు. శ్రీకాకుళం, విజయనగరంలో వరిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. వర్షాలు పడక పండిన కొద్దోగొప్పో పంటకు రేటు రావాలి. కానీ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వ వైఖరిపై జగన్ ధ్వజమెత్తారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని,  రైతులకు న్యాయం జరిగే వరకు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top