అబద్ధాల కోరు చంద్రబాబు: వైఎస్ జగన్


పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు రోజూ అబద్ధాలు ఆడుతున్నారని బాబు అబద్ధాల కోరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఆదివారం సాయంత్రం దీక్ష విరమించారు. జగన్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారన్నారు. రాష్ట్రంలో రైతన్నలకు రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పి తొమ్మిది నెలలైనా ఇంత వరకు చేయలేదని విమర్శించారు. ఈ రోజుకి ఎంత మంది రైతులకు రుణాలు మాఫీ చేశారు. ఎంత మంది డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేశారో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. రైతులకు కొత్త రుణాలు రావడం లేదు, ఎరువులు కూడా  చంద్రబాబు పుణ్యాన అందడం లేదని విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి కరువై వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. చివరకు రైతులకు ఎరువులు కూడా అందడం లేదని జగన్ ఎద్దేవా చేశారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, తలశిల రఘురాం, ఎంవీ ఎస్ నాగిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్లనాని, అంబటిరాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకా శేషుబాబు, ధర్మాన ప్రసాదరావు, రోజా, లక్ష్మీపార్వతి, వాసిరెడ్డి పద్మ, విశ్వే శ్వర్‌రెడ్డి, ఎస్వీమోహన్‌రెడ్డి, అంజాద్ బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top