చంద్రబాబు డైరెక్షన్లోనే రాజకీయ హత్యలు

అనంతపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిజాన్ని నిర్మూలిస్తే... ఏపీ సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో బుధవారం హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత బి.ప్రసాదరెడ్డి అంత్యక్రియలు గురువారం ప్రసన్నాయపల్లి జరిగాయి. ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న  అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.... చంద్రబాబు డైరెక్షన్లోనే రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే చాంద్ బాషా ఆరోపించారు.

అనంత వాసి అయిన డీజీపీ జేవీ రాముడు పనితీరు వివాదాస్పదమవుతోందని విమర్శించారు. పోలీసుల అండతోనే అనంతలో వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హత్యలు జరుగుతున్న సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీత నివాసానికి డీజీపీ వెళ్లడాన్ని వై విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు.

పోలీసుల అండతోనే ప్రసాదరెడ్డి హత్య కావించబడ్డారని  రాప్తాడు వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త ప్రకాష్ రెడ్డి తెలిపారు. గన్మెన్లను ఉపసంహరించి వైఎస్ఆర్ సీపీ నేతలను హత్య చేయాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులు చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ అన్నారు. ప్రసాదరెడ్డి హత్య వెనుక మంత్రి పరిటాల సునీత హస్తముందని శంకర్ నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు.

తాజా వీడియోలు

Back to Top