చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం

కడియం : చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని వైయస్సార్‌సీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు. మంగళవారం మండలంలోని కడియపుసావరంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం అంటే పార్టీ సంక్షేమమే అన్న రీతిలో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఇంత దారుణంగా విఫలమైన ప్రభుత్వం మరొకటి లేదని ఆకుల అన్నారు. తమ పార్టీ నిర్వహిస్తున్న గడపగడపకు వైయస్సార్‌సీపీ కార్యక్రమంలో గ్రామాల్లోని ప్రజలు ఎదురొచ్చి మరీ చంద్రబాబు పాలన తీరును దుయ్యబడుతున్నారన్నారు. వచ్చేనెల మూడవ తేదీన నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అందులో భాగంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆకుల చెప్పారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్లీనరీకి తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆకుల చెప్పారు. సమావేశంలో చక్కపల్లి పుల్లయ్య, మురళి, తొమ్మిదేళ్ళ సూరిబాబు, జ్యోతుల అర్జున్, జ్యోతుల సుధీర్, రాయపాటి అంజి, గంధం దుర్గారావు, తంబాబత్తుల రామకృష్ణ, కేసన దుర్గారావు, కుప్పాల దొరబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top