చంద్ర‌బాబు కుట్ర‌లు

తిరుప‌తి: ప్ర‌త్యేక హోదా మీద ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న పోరాటం, అందుకు ల‌భిస్తున్న ప్ర‌చారాన్ని చూసి ఓర్వ‌లేక‌నే  చంద్ర‌బాబు ప్ర‌భుత్వంకుట్ర‌లు చేస్తోంద‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, నారాయ‌ణ స్వామి మండి ప‌డ్డారు. తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్శిటీలో ప్ర‌త్యేక హోదా మీద అవ‌గాహ‌న స‌ద‌స్సుకి అనుమ‌తి నిరాక‌రించ‌టంపై  మండిపడ్డారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి లో మీడియాతో మాట్లాడారు. ముఖాముఖి అన్న‌ది అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఉద్దేశించింద‌ని, అందుచేత‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని నాయ‌కులు తెలిపారు. ప్ర‌త్యేక హోదా మీద చంద్ర‌బాబుకి చిత్త శుద్ది లేద‌ని మండిప‌డ్డారు.

Back to Top