దేశానికే ప్రమాదకరం చంద్రబాబు: అంబటి రాంబాబు

హైదరాబాద్) దేశానికే ప్రమాదకరం గా చంద్రబాబు పరిపాలన దాపురించిందని
వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిప్రాయ పడ్డారు. ఈ సంగతి కేంద్ర
ప్రభుత్వం గ్రహించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికే విదేశీ పెట్టుబడులు
రావటం లేదని, కానీ రాష్ట్రానికి మాత్రం బోలెడు డబ్బులు వచ్చేస్తున్నాయని ప్రచారం
చేస్తున్నారని, ఇది పచ్చి  మోసం అని
అన్నారు. ప్రత్యేక విమానాల్లో దోచుకొన్న డబ్బుని దాచుకోవటానికి విదేశాలకు పరుగులు
తీస్తున్నారని మండిపడ్డారు. భిక్షమడిగితే పెట్టుబడులు పెట్టరని, ప్రత్యేక హోదాతోనే
పెట్టుబడులు సాధ్యమని అంబటి రాంబాబు అన్నారు. మోసాల్ని బయట పెడితే దబాయిస్తూ,
భయపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనలతో దమ్మిడీ ప్రయోజనం
లేదని ఆయన స్పష్టం చేశారు. దివంగత మహానేత 
వైయస్సార్ పాలనలో విదేశీ పర్యటనలు లేకపోయినా, ప్రజలకు సుపరిపాలన అందించారని
గుర్తు చేశారు. 

Back to Top