ఎన్టీఆర్ లాగే భూమాను మానసిక క్షోభ పెట్టారునాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణంసంతాప సభలో వైయస్ జగన్‌పై విమర్శలా?అమరావతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప సభలో టీడీపీ సభ్యులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పై విమర్శలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియా పాయింట్‌లో మాట్లాడారు. సంతాప సభలో నాగిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడిన సమయంలో రాజకీయాలు మాట్లాడారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్‌గా చేసి ఆ సభలో మాట్లాడటం దుర్మార్గం. సభ ద్వారా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబును శకునిగా చేసి కాపాడేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్‌టీ రామారావును ఎలా మానసిక క్షోభకు గురి చేశారో, ఆయనపై చెప్పులు వేయించింది ప్రజలకు తెలుసు. ఆ బాధతోనే ఎన్‌టీఆర్ మృతి చెందారు. అలాగే∙భూమా నాగిరెడ్డి కూడా మానసిక క్షోభకు గురయ్యారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన భూమాను మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని నమ్మించి పార్టీలో చేర్చుకున్నారు. ఏడాదైనా మంత్రి∙పదవి ఇవ్వకుండా వేధించారు. భూమా బతికినంత వరకు నంద్యాల నియోజకవర్గం గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి చేస్తానని మాట్లాడటం విచారకరం. భూమా చేసిన తప్పులను సభలో మాట్లాడం బాగుండదనే మంచి దృక్పథంతోనే మేం సభకు వెళ్లలేదు. వైయస్‌ఆర్‌సీపీ నుంచి పార్టీ మారిన వారితో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిట్టించారు. హిందు సంప్రదాయం ప్రకారం తల్లి, తండ్రి చనిపోతే మూడు రోజుల వరకు ఇంటి గడప దాటరు. నాడు అఖిలప్రియ అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడేమో 24 గంటలు గడవకముందే అసెంబ్లీకి తీసుకొచ్చారు. పవిత్రమైన దేవాలయానికి వెళ్దాం. మంత్రి పదవి ఇస్తానని బాబు హామీ ఇవ్వలేదని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఆ క్షోభతోనే భూమా మరణించారు. నాగిరెడ్డి చావుకు చంద్రబాబే కారణం, అలాంటి వ్యక్తిపై చనిపోయిన తరువాత గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గం. వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోతే మీరా సానుభూతి చెప్పింది. ఏ రోజు కూడా సభలో ఆయన పేరు విస్మరించడం లేదు. మానవతా దృక్పథంతోనే సభకు హాజరు కాలేదు. చనిపోయినప్పుడు వాళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మా కుటుంబ సభ్యుడిని కోల్పోయామని వైయస్ జగన్ చెప్పారు. దీన్ని కూడా రాజకీయం చేస్తూ తానే ఫోన్ చేసి ఓదార్చానని చంద్రబాబు చెప్పడం దారుణం–––––––––––––––––––చేసిన ద్రోహం చెప్పాల్పి వస్తుందనే సభకు వెళ్లలేదుఎమ్మెల్యే తిప్పారెడ్డివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమా నాగిరెడ్డి చేసిన ద్రోహం గురించి చెప్పాల్సి వస్తుందని ఆయన సంతాప సభకు వెళ్లలేదని ఎమ్మెల్యే తిప్పారెడ్డి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. భూమా నాగిరెడ్డి కుటుంబంలో వైయస్‌ఆర్‌సీపీ తరఫున ముగ్గురికి సీట్లు ఇచ్చిందన్నారు. ఆయనకు పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టామన్నారు. శోభా చనిపోతే ఆమెను చూడటానికి కూడా రాని టీడీపీ నేతలు ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. మూడేళ్లకే అంత సానుభూతి వచ్చిందా? అని ప్రశ్నించారు. మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే భూమా చనిపోయారని ఆరోపించారు. దీనికి చంద్రబాబే కారణమని చెప్పారు.