బాబు–కరువు కవల పిల్లలు

వెలగపూడి: వ్యవసాయం శుద్ధదండగ అనే వ్యక్తి చంద్రబాబు పరిపాలనలో రాష్ట్రం సాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరువు తాండవిస్తోందన్నారు. వ్యవసాయపంటల గిట్టుబాటు ధర గురించి వాయిదా తీర్మాణం అడిగితే స్పీకర్‌ అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు–కరువు కవల పిల్లలుగా ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా రాష్ట్రంలో కరువొస్తుందని ఎద్దేవా చేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల బాబు హయాంలో కరువు ఆంధ్రరాష్ట్రంలో విలయతాండవం చేసిందన్నారు. అదే మాదిరిగానే ఈ మూడేళ్లలో కరువు వచ్చిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Back to Top