యువనేతను చూస్తే చంద్రబాబుకు ముచ్చెమటలు

హైదరాబాద్ 20 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే టీడీపీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయనీ, వారికెందుకంత భయమనీ ఎమ్మెల్యేలుశ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అవినీతికి మూల పురుషుడు చంద్రబాబు అన్నారు. శ్రీ జగన్‌ ఎప్పుడు బయటకొస్తే ఏ దేశం పారిపోవాలని బాబు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబుకి ఒళ్లంతా విషముందని అందుకే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  కుటుంబంపై ఎప్పుడూ చంద్రబాబు విషం కక్కుతుంటారని అన్నారు. చంద్రబాబును తెలుగు తమ్ముళ్లు వదిలేసే రోజు అతిత్వరలో ఉందని చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, తామే సీబీఐ డైరెక్టర్లు అన్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top