లోకేష్ బాబు తెలుసుకో..420 మీ నాయనే

  • ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తే స్పీకర్ ఎందుకు ఆమోదించలేదు
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ అయ్యింది
  • చంద్రబాబు వెన్నుపోటు..కుట్రదారుడు
  • 21మంది దొడ్డిదారిన అమ్ముడుపోయారు
  • విలువలు, విశ్వసనీయత ఉంటే వారంతా రాజీనామా చేయాలి
  • మంత్రి ఉమాకు సవాల్ చేస్తున్నా..దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలి
  • లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి
  • పాదయాత్ర మొదలైతే మంత్రులకు పిచ్చిపట్టడం ఖాయం
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ 
విజయవాడః చంద్రబాబునాయుడు వెన్నుపోటు, కుట్రదారుడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఫిరాయింపు దారుల ముఠా నాయకుడు చంద్రబాబు రాజకీయ వ్యవస్థను, విలువల్ని దిగజార్చాడని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు పెంచి పోషించిన పార్టీని, పదవీ బిక్ష పెట్టిన పార్టీని, పిల్లనిచ్చిన మామ పార్టీని వెన్నుపోటు పొడిచాడు కాబట్టే ఆదినారాయణ, అమర్నాథ్ రెడ్డి గ్యాంగ్ అంతా ఆయన పంచలో చేరిందని విమర్శించారు. తన రాజీనామాను స్పీకర్ ఆమోదించడం లేదన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు. ఆది నారాయణరెడ్డి రాజీనామా చేస్తే స్పీకర్ ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. నీవు ఏ తేదీన రాజీనామా చేశావు, స్పీకర్ కు ఎప్పుడు ఇచ్చావు, ఆయన ఎందుకు ఆమెదించడం లేదో ప్రజలకు చెప్పాలని ఆదినారాయణరెడ్డిని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యవాదులు కూడా ఆలోచన చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జోగి రమేష్ మాట్లాడారు.  చంద్రబాబు, స్పీకర్, 20మంది ఎమ్మెల్యేలు అంతా కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో  ప్రజాస్వామ్య వ్యవస్థ ఖూనీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. దొడ్డిదారిన 21మంది అమ్ముడుపోతే, వారిలో నలుగురిని మంత్రులుగా తీసుకోవడమే గాకుండా ఏకంగా అసెంబ్లీలో వారిని ప్రతిపక్ష నేతమీదకు బాబు ఎగదోసే కార్యక్రమం చేయడం దారుణమని రమేష్ అన్నారు. వైయస్ఆర్ ఆశీస్సులతో మా నాయకుడి ఫోటో పెట్టుకొని, మా పార్టీ గుర్తుపై గెలిచి బాబు పంచన చేరిన మూర్ఖులకు వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విలువలు, విశ్వసనీయత ఉంటే వెంటనే పదవులకు రాజానామా చేయాలని డిమాండ్ చేశారు.  

వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారంటేనే అధికార టీడీపీ భయపడిపోతుందని..ఇక పాదయాత్ర మొదలుపెడితే మంత్రులంతా పచ్చిపట్టి ఆస్పత్రిలో చేరుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తుంటే...పాదయాత్రను అడ్డుకుంటాం, మధ్యలోనే అరెస్ట్ చేస్తామంటూ మంత్రులు మాట్లాడడంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇంత కడుపుమంట ఎందుకని మండిపడ్డారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు.  పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు రోదిస్తుంటే వారికి భరోసానిచ్చేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. అక్కాచెల్లమ్మలు డ్వాక్రా రుణాలు అందక తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతుంటే వారి కన్నీరు తూడ్చేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. ఇంటికో ఉద్యోగం  , ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను బాబు మోసం చేశాడు కాబట్టే, నిరుద్యోగ యువత వేదన విని అన్నగా నీను వస్తున్నానని వారికి భరోసానిచ్చేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వెళుతుంటే...టీడీపీ విమర్శలు చేయడం తగదన్నారు. 

లోకేష్ 420 అని మాట్లాడుతున్నాడని,  420 అనగానే గుర్తుకువచ్చేది మీ నాన్న చంద్రబాబునాయుడేనన్న విషయం తెలుసుకోవాలని  జోగి రమేష్ హితబోధ చేశారు. నిద్రపోయే పిల్లాడిని అడిగినా 420 ఎవరంటే చంద్రబాబు అని చెబుతారన్నారు. మీరు ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే వారికి అండగా నిలిచి భరోసానిచ్చేందుకు వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. ఎన్టీ రామారావు అని లోకేష్ పలికితే అవార్డు ఇస్తామని చురక అంటించారు. దొడ్డి దారిన ఎమ్మెల్సీ, పార్టీ ప్రధానకార్యదర్శి, మంత్రి అయిన వ్యక్తి లోకేష్ అని నిప్పులు చెరిగారు. ఇది ఏపీ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని, ఇటువంటి మంత్రులు జగన్ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. బాబు విదేశాల్లో సెల్ఫీలు, ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.  ఇంకా ఎన్ని సంవత్సరాలు బొమ్మలు చూపిస్తావు బాబు అని రమేష్ దుయ్యబట్టారు. నిజమైన సినిమా బాబుతో వెళితేనే తెలిసిందని రాజమౌళి కూడ ఆశ్చర్యపోతున్నాడంటే ఆయన ఎలాంటాడో తెలుస్తోందని రమేష్ ఎద్దేవా చేశారు. 

ప్రజల కష్టాలకు భరోసా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత పాదయాత్రను స్వాగతిస్తున్నారని జోగి రమేష్ తెలిపారు.  మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిన మంత్రి దేవినేని సొల్లు ఉమ...దమ్మూ, ధైర్యముంటే వాటిని నిరూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెదలంక డ్రైన్ అన్నీ నీ శాఖ పరిధిలోనే ఉన్నాయి. మూడున్నరేళ్లుగా నీవు నీటిపారుదల శాఖామంత్రిగా ఉన్నావు. పెదలంక డ్రైన్ లో నా పాత్ర ఉంటే మూడున్నరేళ్ల నుంచి గాజులు తొడుక్కోని కూర్చున్నావా. నీకు దమ్ముదైర్యం ఉంటే నాపై ఆరోపణలు నిరూపించే సత్తా నీకుంటే టైమ్, డేట్, ప్లేస్ ఎక్కడో చెప్పు. పాత్రికేయులు, ఇంజినీరింగ్, విశ్లేషకుల సమక్షంలో చర్చకు నేను సిద్ధం, నీవు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నీ ఇంటికి, ఆఫీసుకు లేఖ పంపిస్తా. 24గంటల్లో నీవు స్పందించకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు. ప్రభుత్వం మీది, నాపై ఆరోపణలకు కట్టుబడి ఉంటే నిరూపించాలన్నారు. నాపై విమర్శలు చేస్తే దేవినేని ఉమ నోటిని శుద్ధి చేసే కార్యక్రమం చేస్తామన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top