చదును పేరుతో రూ. 177 కోట్ల అవినీతి

అనంతపురం: చదును పేరుతో రూ. 177 కోట్లు ప్రభుత్వమే ఖర్చు చేయడంలో ఏదో అవినీతి కుట్ర దాగివుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. అనంత పెనుగొండ సమీపంలో ఉత్తర కొరియాకు చెందిన కియా కార్ల కంపెనీకి కేటాయించిన స్థలాన్ని ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శంకర్‌ నారాయణ మాట్లాడుతూ... చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా తన కుమారుడు లోకేష్, మంత్రులకు ఎంత మిగులుతుందనే ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యం లేదన్నారు. ఎక్కడైనా ప్రైవేట్‌ వ్యక్తులు భూములు కొనుగోలు చేస్తే వారే చదును చేసుకుంటారన్నారు. కానీ ఏపీలో కియా కార్ల కంపెనీ కోసం చంద్రబాబు రైతుల దగ్గర నుంచి ఎకరా రూ. 10.5 లక్షలకు సుమారు 600 ఎకరాల భూమిని తీసుకొని దాన్ని చదును చేయడానికి రూ. 177 కోట్లు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే ఎకరాకు రూ. 29 లక్షలు చదునుకే పడుతుందన్నారు. దీనిలో పెద్ద అవినీతి కుంభకోణం దాగివుందన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. అదే రూ. 29 లక్షలు రైతులకు చెల్లిస్తే బాగుండేదన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top