చేతిలో బైబిల్ పై రాద్ధాంతం తగదు: బాబూరావు

పాయకరావుపేట:

వైయస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేతిలో బైబిలు పట్టుకోవడాన్ని రాజకీయం చేస్తున్న వారిపై ఆ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మండిపడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని ఆయన వారికి హితవు పలికారు. నేను వెంకటేశ్వరస్వామి ఛాయాచిత్రాన్ని జేబులో పెట్టుకుంటాను అంటే నేను కూడా మత ప్రచారం చేస్తున్నట్లా అని ఆయన ప్రశ్నించారు. తన మతం మానవత్వమని ఆమె చెప్పడాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. ఆమెకు తొలినుంచి బైబిలు చేతిలో ఉంచుకోవడం అలవాటన్నారు. దీనిపై రాద్ధాంతం తగదని బాబూరావు కోరారు.

తాజా వీడియోలు

Back to Top