కేంద్రం జోక్యం చేసుకోవాలి...మాజీ ఎంపీ అనంత‌

అనంతపురం: సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో రెండో రోజు జర్నలిస్ట్ల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ శిబిరాన్ని మాజీ ఎంపీ అనంత వెంక‌ట్రామిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ....రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే సాక్షిపై చంద్రబాబు ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, బీజేపీ నాయకులు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బాబు ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. 
Back to Top