విశాఖ ఎయిర్‌ పోర్టు మూతపడదు

న్యూఢిల్లీ: భోగాపురం ఎయిర్‌ పోర్టు ప్రారంభమైన తరువాత కూడా విశాఖ ఎయిర్‌ పోర్టు మూతపడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఎయిర్‌పోర్టు కొనసాగించాలని స్టీరింగ్‌ కమిటీ సిఫార్స్‌ చేసిందని పేర్కొంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా సమాధానం చెప్పారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో విమానాల రాకపోకలు యధావిధిగా సాగుతాయని వెల్లడించారు. విశాఖ లాంటి మేజర్‌ ఎయిర్‌ పోర్టును మూసేయడం వలన దానిపై ఏఏఐ పెట్టిన పెట్టుబడులకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా తెలిపారు. 
కొండపల్లి ఆయిల్ పైపులైన్‌ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారందరికీ చట్టబద్ధంగానే పరిహారం అందిస్తున్నామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వినిమయ హక్కు కింద జరిగే భూసేకరణలో యాజమాన్యం మారదని స్పష్టం చేశారు. భూమి సొంత దారుడే యజమానిగా కొనసాగుతారని చెప్పారు. అలాగే పైప్‌లైన్‌ నిర్మాణం సందర్భంగా పంటలు, చెట్లు, కట్టడాలకు ఏదైనా నష్టం జరిగిన పక్షంలో సంబంధింత అధికారులు ఆ నష్టాన్ని మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించడం జరుగుతుందని కూడా వివరించారు.


 

తాజా వీడియోలు

Back to Top