కేంద్రం కూడా మ‌భ్య‌పెడుతోంది

ఢిల్లీ:  ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం మాదిరిగానే కేంద్రం కూడా ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. బ‌డ్జెట్‌లో ఏపీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో రాజ‌ధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌లో భూములు కొన్న టీడీపీ నేత‌ల‌కు మాత్ర‌మే ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. వాళ్ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌నే పార్ల‌మెంట్‌లో టీడీపీ ఎంపీలు బ‌ళ్ల‌లు చ‌రిచార‌ని ఎద్దేవా చేశారు.  రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌చ్చే వ‌ర‌కు వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున పోరాటం చేస్తుంటే..టీడీపీ ఎంపీలు ప్యాకేజీ కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

Back to Top