ఇదండీ అసలు సంగ‌తి..!

పుష్క‌రాలు చెప్పి అంతా పుణ్యం మూట క‌ట్టుకొంటుంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం అడ్డ గోలుగా పాపం మూట క‌ట్టుకొంటున్నారు. ఆర్భాటంగా వ్య‌వ‌హ‌రించి 30 మంది ప్రాణాలు తీయ‌టంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. పుష్క‌రాలు పూర్త‌య్యే దాకా అక్కడే ఉంటాన‌ని చెప్ప‌టంపై ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది.
అస‌లు సంగ‌తి ఏమిటంటే పుష్క‌రాల పేరుతో రూ. 1,650 కోట్ల రూపాయిల మేర ఖ‌ర్చులు రాశారు. ఇందులో ప‌దో వంతు కూడా ఖ‌ర్చు పెట్ట లేద‌ని, మొత్తం తెలుగు త‌మ్ముళ్లు నొక్కేశార‌ని బ‌హిరంగంగా చెప్పుకొంటున్నారు. స్థానికంగా ఉండే ప్ర‌జా ప్ర‌తినిధుల్ని కూడా ప‌ట్టించుకోకుండా, కోట‌రీ చేతుల మీదుగా ప‌నులు చేయించేశారు. తీరా చేసి ఈ నాసిర‌కం ప‌నులకు బిల్లులు క్లియ‌ర్ కావ‌టం లేద‌ని ఫిర్యాదు రావ‌టంతో కోట‌రీ నుంచి ముఖ్య‌మంత్రి పై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు బిల్లులు పాస్ చేయించుకొనేందుకు మార్గాలు వెద‌కుతున్నారు. 
ఇందులో భాగంగానే సీఎం అక్క‌డ మ‌కాం వేశార‌న్న మాట వినిపిస్తోంది. పుష్క‌రాల త‌ర్వాత త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని చెప్ప‌టం ఇందులో భాగ‌మే అని అంటున్నారు. బిల్లుల‌ను క్లియ‌ర్ చేసే అధికారుల్ని మిన‌హాయించి, గ‌ట్టిగా ప‌ట్టు ప‌డుతున్న అధికారుల మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా మాట విన‌ని కొంద‌రు పోలీసు అధికారుల్ని కూడా ఇదే హ‌డావుడిలో ప‌క్క‌కు సాయం ప‌ట్టేటందుకు రంగం సిద్దం అయిన‌ట్లు తెలుస్తోంది. మొత్తం మీద పుష్క‌రాలు ద‌గ్గ‌ర ఉండి జ‌రిపించార‌న్న ఖ్యాతి ద‌క్కుతుంది, గుట్టు చప్పుడు కాకుండా ప‌నులు కూడా చ‌క్క బెట్టుకోవ‌చ్చు. 

తాజా వీడియోలు

Back to Top