కొంప ముంచిన సినిమా పిచ్చి..!

పుష్క‌రాల తొక్కిస‌లాట‌
గురించి కొత్త విష‌యాలు
వెలుగు చూశాయి. చంద్ర‌బాబు షార్ట్
ఫిల్మ్ పిచ్చి అసలు కార‌ణం
అని స్ప‌ష్టం అవుతోంది.
కొంత కాలంగా ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో చంద్ర‌బాబు బుర‌ద‌లో కూరుకొని
పోయారు. దాని నుంచి బ‌య‌ట ప‌డేందుకు మార్గాలు అన్వేషిస్తూ వ‌చ్చారు. ఆయ‌న‌కు పుష్క‌రాలు ఒక సాకుగా
క‌నిపించింది. పుష్క‌రాలు అద్భుతంగా
నిర్వ‌హించిన కీర్తిని సొంతం చేసుకొంటే దేశ
వ్యాప్తంగా పేరు ప్ర‌తిష్ట‌లు మార్మోగి పోతాయ‌ని త‌లంచారు.
వెంట‌నే జాతీయ టీవీ
ఛానెల్ ను ఒక దాన్ని
సంప్ర‌దించారు.  ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ జాతీయ చానెల్ సిబ్బంది
కోసం ఆగ మేఘాల మీద
ఏర్పాట్లు జ‌రిగిపోయాయి. దాదాపు
50 మంది దాకా సిబ్బంది రాజ‌మండ్రిలో మ‌కాం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ చానెల్ నిపుణులు
ముందుగా ఘాట్ల‌ను ప‌రిశీలించి ఎక్కువ మంది జ‌నం
వ‌చ్చే రేవు గురించి
ఆరా తీశారు. స్థానికంగా ఉన్న స‌మాచారంతో
పుష్క‌రాల రేవుకి విప‌రీతంగా జనం వ‌స్తార‌ని తెలుసుకొన్నారు. దీంతో
ముఖ్య‌మంత్రి కుటుంబ స‌మేతంగా పుష్క‌రాల రేవులోనే స్నానాలు
చేయాల‌ని ఈ చానెల్
నిపుణులు సూచించారు. ఆ సూచ‌నకు
అనుగుణంగా చివ‌రి స‌మ‌యంలో వీఐపీ
ఘాట్ కు బ‌దులుగా
పుష్క‌రాల రేవులో ముఖ్య‌మంత్రి స్నానాలు చేశారు. దీని కోసం రెండు
గంట‌ల పాటు జనాన్ని
ఆపేశారు. వారిని ఒక్క‌సారిగా వదిలితేప్ర‌వాహంలా వ‌చ్చే జ‌నాన్ని చిత్రించేందుకు పెద్ద పెద్ద కెమెరాలు
ఏర్పాటు చేసుకొన్నారు. దీని ప్ర‌కారం
జనాల్ని ఒక్క‌సారిగా ఒకే
గేటు నుంచి వ‌దిలారు.
ఈ సంగ‌తి తెలియ‌ని అమాయ‌క
జ‌నం తొక్కిస‌లాట‌లో చిక్కుకొని పోయారు.

చంద్ర‌బాబు సినిమా పిచ్చికోసం
అన్నెం పున్నెం ఎర‌గ‌ని
జ‌నాలు చ‌చ్చిపోయారు.
రెండు రోజులుగా ముఖ్య‌మంత్రి అక్క‌డే ఉండ‌టంతో
అధికారులంతా ఆయ‌న చుట్టూ
మూగారు. దీంతో జ‌నానికి
కావాల్సిన తాగునీటి స‌ర‌ఫ‌రా, వైద్య శిబిరాల
మోహ‌రింపు, అంబులెన్స్ ల ఏర్పాటు వంటి
విష‌యాల్ని గాలికి వ‌దిలేశారు

Back to Top