ప్రకాశంః కనిగిరి నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు వివాహ వేడుకలకు వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. మొదట కనిగిరి టౌన్ పాతూరులో గండ్రవారి వివాహ వేడుకల్లోపాల్గొన్నారు. అనంతరం సి.యస్.పురం మండలం తాడేవారి పల్లెలో, కనిగిరి మండలం పేరంగూడి కొత్తపల్లి ఆవుల వారి వివాహ వేడుకల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.