బుడంపాడు నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభం

గుంటూరు, 16 మార్చి 2013: మహానేత డాక్టర్ వైయస్‌ రా‌జశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేడు 92వ రోజు శనివారం ఉదయం ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఆమె ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తారు. నారాకోడూరు... వేజెండ్ల మీదుగా శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు. శ్రీమతి షర్మిల శనివారంనాడు మొత్తం 14.2 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందని గుంటూరు జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రికి బసచేసిన చోటు నుంచి శనివారం ఉదయం బయలుదేరిన శ్రీమతి షర్మిల ప్రత్తిపాడు నియోజకవర్గం బుడంపాడు మీదుగా భోజన విరామకేంద్రానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం నారాకోడూరు, వేజెండ్ల మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
Back to Top