కరువు మీద చంద్రబాబు తప్పుడు ప్రకటనలు

హైదరాబాద్) రాష్ట్రమంతా విస్తరించిన కరువు మీద చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ అభిప్రాయ పడ్డారు. అందుకే మంత్రులు, ఉన్నతాధికారులు చూసుకోలేదని ప్రకటనలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు చూసినా అనుభవజ్నుడిని అని, టెక్నాలజీని చేతిలో పెట్టుకొన్నానని చెప్పే చంద్రబాబు ఇలా చెప్పడం విడ్డూరం అని పేర్కొన్నారు. పుష్కరాలు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమం అని, దానికి విపరీతంగా హడావుడి చేశారని పేర్కొన్నారు. ఈ హడావుడిలో రైతుల్ని గాలికి వదిలేశారని బొత్స వివరించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top