వైయ‌స్ జగన్ సీఎం కావడం తథ్యం


- వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌
 తిరుపతి :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుబి మోగిస్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డం త‌థ్య‌మ‌ని పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి పాపాలు పండాయని ఆయ‌న మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క వాగ్దానాన్ని కుడా చంద్రబాబు నిలబెట్టుకొలేదని నిప్పులు చెరిగారు. భూమన సమక్షంలో కాంగ్రెస్ క్రీయాశీలక నేత చిన్ని నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి భూమన ఆహ్వానించారు. కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ కే బాబు. ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్ర, మైనారిటీ నేత ఖాధ్రీ, ఎంవీఎస్ మని, కుసుమ కుమారి, సాకమం ప్రభాకర్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వైయ‌స్ జగన్‌కు నీరాజనం పలుకు తున్నారని తెలిపారు. పాదయాత్రలో తండోప తండాలుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. జగన్ సీఎం అయిన తరువాత ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.


Back to Top