నాన్న‌ పై త‌ప్పుడు కేసు పెట్టారు..!

క‌ర్నూలు: క‌ర్నూలు జిల్లా లో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ని అరెస్టు చేయ‌టంపై ఆయ‌న కుమార్తె, పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పందించారు. పోలీసులే అకార‌ణంగా దూషించి, త‌మ‌ను రెచ్చ‌గొట్టి త‌మ తండ్రిపై అక్ర‌మంగా కేసు పెట్టార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఓటు వేయ‌టానికి వెళ్లిన‌ప్పుడు పోలింగ్ స్టేష‌న్ ద‌గ్గ‌ర తండ్రి కోసం తాను ఎదురు చూస్తున్నాన‌ని చెప్పారు. ఈలోగా పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చి ఓటు వేయాల‌ని బ‌ల‌వంతం పెట్టార‌ని, ప‌ది నిముషాల్లో వ‌చ్చి ఓటు వేస్తాన‌ని చెప్పినా విన‌కుండా దుర్బాష లాడారని ఆమె అన్నారు. ఈసంగ‌తి తెలిసి తండ్రిగా భూమా నాగిరెడ్డి క‌ల‌గ చేసుకొని పోలీసుల్ని ప్ర‌శ్నించార‌ని,ఆ దానికే ఈ విధంగా కేసులు పెట్టి వేధిస్తున్నార‌ని ఆమె అన్నారు. పోలీసుల‌తో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్ట‌డానికి ఏమైనా సంబంధం ఉందా అని భూమా అఖిల ప్రియ ప్ర‌శ్నించారు. గ‌తంలో ఎలా చేశారో, ఇప్పుడు అలాగే  చేస్తున్నార‌ని ఆమె అన్నారు.
Back to Top