హైదరాబాద్, 11 అక్టోబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు మాతృమూర్తి భూదేవమ్మ (78) మృతి పట్ల వైయస్‌ఆర్ సిపి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభాకరరావు రాజకీయ ఎదుగుదలలో భూదేవమ్మ కృషి ప్రశంసనీయమని విజయమ్మ నివాళులు అర్పించారు. జూపూడి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. అంతకు ముందు నిమ్స్‌లో చికిత్స పొందుతున్న భూదేవమ్మను బుధవారం ఉదయం విజయమ్మ స్వయంగా వెళ్లి పరామర్శించారు.
భూదేవమ్మ మరణ వార్త తెలిసిన అనంతరం పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, సీనియర్ నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, కొల్లి నిర్మలకుమారి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, తదితరులు జూపూడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
తీవ్ర అనారోగ్యంతో బాధపడిన భూదేవమ్మ గత పది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం మధ్యాహ్నం ఆమె మరణించారు. భూదేవమ్మ అంత్యక్రియలు వారి స్వస్థలం ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సంకువారికుంటలో గురువారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.