బీసీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక
విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. రాజమండ్రికి చెందిన బీసీ నేతలు ఇవాళ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. యాత్ర‌కూల రాష్ట్ర అధ్య‌క్షుడు మానని నాగేశ్వరరావు, మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో బీసీ సంఘం జేఏసీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  విజయనగరం జిల్లాలోని పాపయ్యవలస వద్ద ప్రజా సంకల్ప యాత్రలో వీరు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..భరత్, నాగేశ్వరరావును, బీసీ నేతలందరిని పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు.  రాజ‌మండ్రి చ‌రిత్ర‌లో ఇంత‌వ‌ర‌కు బీసీల‌కు పార్ల‌మెంట్ సీటు కేటాయించ‌లేద‌న్నారు. తాను బీసీల‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంట్ సీటు ఇస్తాన‌న్న మాట నిల‌బెట్టుకుంటాన‌ని పేర్కొన్నారు.  ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. బీసీలకు తోడుగా నిలబడతామని, బీసీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. 
 
 
Back to Top