బషీర్‌బాగ్ అమరులకు విజయమ్మ నివాళి

హైదరాబాద్ 14 మార్చి 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్ళారు. తొలుత బషీర్‌బాగ్‌లోని అమరవీరు స్థూపం వద్ద వారు నివాళులర్పించారు. కరెంటు కోతలు, విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా వారు నినాదాలు చేశారు. కరెంటు కోతలకు నిరసనగా వారు చేతిలో విసనకర్రలు, ప్లకార్డులు పట్టుకున్నారు. వైయస్ఆర్ జోహార్, విజయమ్మ గారి నాయకత్వం వర్థిల్లాలి, జై జగన్ అంటూ వారు నినాదాలు చేశారు. సీపీఐ ఎమ్మెల్యేలు కూడా ర్యాలీలో పాల్గొన్నారు.  
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా విద్యుత్తు సరఫరా పరిస్థితి ఇప్పటిలాగానే ఉందనీ, రెండు మూడు గంటలు కూడా కరెంటు ఉండేది కాదనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చెప్పారు. అప్పట్టో మహానేత డాక్టర్ వైయస్ఆర్ వామపక్షాలతో కలిసి పదకొండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నిరాహార దీక్ష చివరిరోజున ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోగా, 200మంది గాయపడ్డారన్నారు. విద్యుత్తు సమస్యపై శాసన సభలో వాయిదా తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు.

Back to Top