<strong>వైయస్ జగన్ సీఎం అయితేనే బీసీల అభివృద్ధి</strong><strong><br/></strong><strong>నెల్లూరు:</strong> బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంటున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అందరికీ పెద్దకొడుకుగా ఉంటానని చెప్పిన చంద్రబాబు బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిని నీరుగార్చాడని మండిపడ్డారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాల బీసీ సదస్సును నెల్లూరులో నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరప్రసాద్, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, మహాత్మ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదస్సులో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ ప్రాధాన్యం, బీసీ డిక్లరేషన్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రస్తావించారు. సదస్సులో నిర్ణయించిన అంశాలను, నాయకుల అభిప్రాయాలను ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరుపనున్న బీసీ గర్జన సభలో ప్రస్తావించి మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు మాజీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు.