బాబును వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చించండి

బాబును వెంటనే పిచ్చాస్పత్రిలో చేర్చించండి
ఓఆర్‌ఆర్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కట్టించానని చెప్పుకోవడం సిగ్గుచేటు
చంద్రబాబు చేసిన ఏకైక ఉద్యమం దోమలపై దండయాత్ర
అరచేతిలో వైకుంఠం చూపుతూ ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు
రాష్ట్ర బాగు కోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారు
జననేత సీఎం అయితేనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయి
వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి

కాకినాడ: చంద్రబాబుకు మతిభ్రమించిందని, వెంటనే పిచ్చాస్పత్రిలో వైద్యం చేయించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కాకినాడలో వంచనపై గర్జన సభకు ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌ పర్యటనకు వెళ్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఎయిర్‌పోర్టు నిర్మించానని చెబుతున్నాడన్నారు. చంద్రబాబుకు బుద్ధి, సిగ్గు, లజ్జ ఏమైనా ఉంటే ఆలోచించుకొని మాట్లాడాలి. ఔటర్‌రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టును నిర్మించింది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ఔటర్‌రింగ్‌రోడ్డులో అవకతవకలు జరిగాయని అసెంబ్లీలో ఆరోపణలు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేసిన మగాడు వైయస్‌ఆర్‌ అని చెప్పారు. అందుకే చంద్రబాబును పిచ్చాస్పత్రికి పంపించాలన్నారు. 

ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు చేసిన ఏకైక పోరాటం దోమల మీద చేశాడని, వాటి మీద కూడా గెలవలేదని పార్థసారధి ఎద్దేవా చేశారు. రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడిపోతుందన్నారు. అఖరికి దోమల మీద కూడా చంద్రబాబు గెలవలేకపోయాడన్నారు. ఒక పక్క అవినీతి మీద పోరాటం అంటూనే.. మంత్రులు, ఎమ్మెల్యేలను దగ్గరుండి అవినీతి చేయిస్తున్నాడన్నారు. ఇసుక, మట్టి, రాజధానిలో భూదందా విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ పాలనను, చంద్రబాబు పాలనను గుర్తు చేసుకోవాలన్నారు. పోలవరం ప్రారంభిస్తే ఆదిలాబాద్‌లో ప్రతి పేదవాడికి రేషన్‌ లభించింది. పులిచింతల ప్రాజెక్టు మొదలు పెడితే వరంగల్‌లో ప్రతి రైతుకు మద్దతు ధర లభించింది. చంద్రబాబులా అరచేతిలో వైకుంఠం చూపలేదన్నారు. పేదవారికి 10 లక్షల ఎకరాలు పంచిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. 

చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి రాష్ట్రానికి కనీసం చిన్న మేలు కూడా చేయలేదు. చంద్రబాబు వంచన చేశాడు కాబట్టే గర్జన చేస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా కావాలని చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు అనుకుంటున్నామని, హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రజల జీవితాలు బాగుపడతాయని మొదటి నుంచి వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నాడన్నారు. ప్రజలంతా ఆలోచించాలి. నవంబర్‌ 2017లో అసెంబ్లీ సమావేశంలో రాతపూర్వకంగా 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఇచ్చిన లేఖను చూపించి నిలదీశారన్నారు. రాష్ట్రం కోసం పోరాడే నాయకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరేనని, జననేత ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. 
Back to Top