<strong>విజయనగరంః </strong>చంద్రబాబుకు ప్రచార్భాటమే తప్ప తుపాన్ బాధితులను ఆదుకునే చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందక బాధితులు తిరుగుబాటు చేస్తుంటే ఆ నెపాన్ని వైయస్‌ఆర్‌సీపీపై నెట్టడం తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యధోరణి, అసమర్థతకు ఈ ఆరోపణలకు నిదర్శనమన్నారు. విఫలమైన ప్రతీసారి సాకులు వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటన్నారు. ఇతర ప్రాంతాల్లో లబ్ధిపొందడం కోసం వైయస్‌ఆర్‌సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సాయం కోసం తుపాను బాధితులు హాహాకారాలు చేస్తుంటే సహాయక చర్యలు బాగా జరుగుతున్నాయని బాబు ప్రచారం చేస్తున్నారన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ దానిని సానుకూలంగా మలుచుకుంటానని తరుచు చెప్పె చంద్రబాబు..తుపాన్ బాధితులను ఆదుకోవడంలో విఫలమయి పూర్తిగా వైయస్‌ఆర్‌సీపీపైకి నెట్టివేసే చర్యలకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యకం చేశారు.ప్రభుత్వ వైఫల్యానికి పూర్తి బా«ధ్యత చంద్రబాబే వహించాలన్నారు.