బాబు ఓ మాయ‌ల ప‌కీర్‌

తుడుమలదిన్నె (ఖాజీపేట): ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతూ, చంద్రబాబు మాయలప‌కీరులా అందరినీ మోస‌గిస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘరామిరెడ్డిలు విమర్శించారు. తుడుమలదిన్నె గ్రామంలో వైయ‌స్సార్ సీపీ నాయకుడు కృష్ణారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు 3 ఏళ్ల పాలనలో ఒక్క దేవాల‌యానికి కూడా న‌యా పైసా మంజూరు చేయ‌లేద‌న్నారు. తుడుమలదిన్నె గ్రామంలో నిర్మించిన సీతారామ ఆలయానికి గత పాలన హ‌యాంలో మంజూరైన నిధులతోనే నేడు గుడి పూర్తి అయ్యిందన్నారు. దేవుని ఆలయాలకు బాబు పైసా ఖర్చు చేయకపొగా ఉన్న దేవాలయాలను కూల్చివేయ‌డం దారుణం అన్నారు. తన పబ్లిసిటీ పిచ్చి వల్ల పుష్కరఘాట్‌లో అనేక మంది భ‌క్తులు మృతి చెందార‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ మృతుల‌కు సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. పుష్క‌రాల పేరుతో వందల కోట్లు టీడీపీ నేత‌లు జేబులు నింపుకున్నార‌ని మండిపడ్డారు. 

మాటలతో కాలయాపన
చంద్ర‌బాబు మూడేళ్ల ప‌రిపాల‌న‌లో పేద‌వాడికి ఒక్క ఇల్లు కూడా నిర్మించ‌లేద‌ని వైయ‌స్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డిలు మండిప‌డ్డారు. ఆరుగాలం రైతుల పండించిన పంట‌కు క‌నీసం గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డంలో కూడా ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌న్నారు. ఎన్నికల ముందు రూ. 5 వేల కోట్ల‌తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పారని, ఆ నిధి ఇప్పుడు ఎక్కడ ఉంది అని వారు ప్రశ్నించారు. కేవలం తన గారడీ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాసులరెడ్డి(వాసు) మాజీ ఉపసర్పంచ్‌గంగాధర్‌రెడ్డి, తోపాటు పలువరు మండల నాయకులు  త‌దిత‌రులు పాల్గొన్నారు. 
Back to Top