<strong>ఢిల్లీః</strong> టీడీపీ,బీజేపీలు చేసిన అన్యాయంతో ఏపీ అభివృద్ధిలో వెనుకబడిపోతుందని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.చంద్రబాబుకు తమ రాజకీయ స్వప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు.మాయా మాటలతో ఇంద్రజాలికుడి మించిన వంటి ఇంద్రజాలాన్ని సృష్టిస్తూ అమరావతి పేరుతో ఒక శాశ్వతమైన నిర్మాణానికి శంకుస్థాపన చేయకుండా నాలుగున్నరేళ్లు తర్వాత నేడు సెక్రటేరియట్‌కు శంకుస్థాపన, కడప ఉక్కుకు శంకుస్థాపన అంటూ కాలయాపన కార్యక్రమాలను చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారని దుయ్యబట్టారు.యుద్ధం ముందు ఆయుధాలను సమీకరిస్తూనట్లుగా ప్రజలను మళ్లీ మోసం చేయడానికి శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు వేషానికి భీష్ముడు..నైజానికి శకునిలా రాష్ట్రానికి దాపురించారన్నారు.చంద్రబాబులో ఏవిధమైన ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే స్వభావం లేదన్నారు.తన స్వార్థం కోసం..తన రాజకీయం అవసరాలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు.