ఢిల్లీకి కూడా రుచి చూపించిన చరిత్ర చంద్రబాబుదే..వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు..
ఢిల్లీః అలుపెరగని,మడమ తిప్పని,మాట తప్పని నేత వైయస్ జగన్ అని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు.వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకహోదాపై వైయస్‌ఆర్‌సీపీ ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం చేస్తూనే ఉందన్నారు.రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కోసం రోడ్లు మీదకొచ్చి పని చేస్తున్నామన్నారు. చంద్రబాబు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెబుతారని,నలభై ఏళ్ల ఇండ్రస్టీలో ఏ ఒక వర్గానైనా మోసం చేయకుండా వదిలివేశారా అని ప్రశ్నించారు.గతంలో చంద్రబాబు నాయుడు కుట్రలు ఆయన కుటుంబసభ్యులకు,తెలుగు ప్రజలకు మాత్రమే తెలుసు అని, కాని ఈ సారి అధికారంలోకి వచ్చాకా మోసం,కుట్ర, దగా ఢిల్లీకి కూడా రుచి చూపించిన చరిత్ర చంద్రబాబుది అని అన్నారు.2014 ఎన్నికల్లో మోదీని తీసుకుని వచ్చి వెంకయ్యనాయుడిని పక్కన పెట్టుకుని ప్రత్యేకహోదాను తీసుకువస్తాను..నేనే ప్రత్యేకహోదాకు ఛాంపియన్ అని చెప్పి ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ఏరు దాటక తెప్ప తగలేశారన్నారు.