బాబుకు బుద్ధి వచ్చేలా చెప్పులు చూపించండి

అనంతపురంః  కదిరి జనసంద్రమైంది. జననేత వైయస్ జగన్ కు ప్రజలు నీరాజనం పట్టారు. తమ అభిమాన నేతను చూసేందుకు జనం కదిరికి పోటెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కదిరి చేరుకున్న వైయస్ జగన్ కు పార్టీశ్రేణులు, ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. ఈసందర్భంగా అధ్యక్షులు వైయస్ జగన్ మాట్లాడుతూ...ప్రభుత్వ మోసపూరిత పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ కు , కేంద్రానికి తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. రైతులు, చేనేతల ఆత్మహత్యలకు కారణమైన బాబుకు బుద్ధి వచ్చేలా చెప్పులు చూపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Back to Top