బాబు తాతైనా దిగిరావల్సిందే

  • సిగ్గులేదా చంద్రబాబు నీకు
  • నీ హయాంలో హంద్రీనీవా ఒక్క అడుగైనా ముందుకు పడిందా
  • నీటి విడుదలపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా..?
  • వైయస్ జగన్ రాకతో టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదు
  • హంద్రీనీవా వైయస్‌ఆర్‌ వరప్రసాదిని
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి
ఉరవకొండ: మన హక్కును దక్కించుకోవడం కోసం వైయస్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన మార్గం పోరాటం ఒక్కటే.. వైయస్‌ జగన్‌ పోరాటంతో చంద్రబాబు తాతైనా దిగిరావల్సిందేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండలో వైయస్సార్సీపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహాధర్నాకు వైయస్‌ జగన్‌ వస్తున్నారని తెలిసి టీడీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు నిద్రపట్టడం లేదని అన్నారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవులు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా రైతులు నీరు లేక కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం హంద్రీనీవా ప్రాజెక్టుతో నీరు ఇచ్చాం, రైతులు అంతా వరినాట్లు వేస్తున్నారని గొప్పులు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రైతాంగానికి నీరు ఇచ్చారని శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా చంద్రబాబు అని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌ వరప్రసాదిని అని కొనియాడారు. మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 25 లక్షల మందికి త్రాగునీరు కోసం వైయస్‌ఆర్‌ హంద్రీనీవా తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

నీళ్లు అడగడం రాజకీయమా?
తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హంద్రీనీవాకు కేవలం రూ. 13 కోట్లు ఖర్చు చేసి ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. నేనే రాయలసీమకు నీరు ఇచ్చానన్న చంద్రబాబు హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులలో ఎన్ని కిలోమీటర్లు కాలువలు తవ్వించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 1999 సంవత్సరంలో బాబు అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనీవా తాగునీటిని 5 టీఎంసీలకు కుదించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యివుంటే ఇప్పటికి అనంత జిల్లాలో 80 వేల ఎకరాలకు నీరు వచ్చేదని చెప్పారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం ఇబ్బందులను చూసి వైయస్‌ జగన్‌ ముందుకు వచ్చి దీక్షలు చేస్తుంటే టీడీపీ నేతలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. త్రాగు, సాగు నీరు అడగడం, ఇళ్లు అడగడం, రుణమాఫీ అడగడం రాజకీయమా అని నిలదీశారు. హంద్రీనీవా నీటిని వేరే ప్రాంతాలకు తరలించాలనుకుంటే ఉరవకొండ ప్రజలు చూస్తూ ఊరుకోరని చంద్రబాబును హెచ్చరించారు. హామీలను అమలు చేయని ప్రభుత్వ పరువును ప్రతిపక్షం రోడ్డుపై పెట్టినా సిగ్గులేదా అని చురకంటించారు. వైయస్‌ జగన్‌ నేతృత్వంలో పోరాటాలు చేసి హంద్రీనీవా నీటిని సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 
Back to Top