చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..

అనంతపురంః చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్మికులను అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. అరెస్టయిన మున్సిపల్‌ కార్మికులను ఆయన పరామర్శించారు. మున్సిపల్‌ కార్మికులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని, తక్షణం వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలు ఎప్పుడూ విజయవంతం కావన్నారు.
Back to Top