లక్ష సాయం అన్నారు..రిక్తహస్తం చూపారు..

మాట తప్పడం చంద్రబాబు నైజం..
చంద్రబాబుపై దివ్యాంగుల ఆగ్రహం..

శ్రీకాకుళంః చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని విజయవాడకు చెందిన దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్లు,చేతులు లేని వికలాంగుడికి లక్ష సాయం చేస్తానని చెప్పి తొమ్మిది నెలలు అయినా ఇప్పటికి ఇవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేస్తారని దివ్యాంగులు మండిపడ్డారు.ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో జరుగుతున్న జననేతను కలిసి మొరపెట్టుకున్నారు. ఏపీలో 27 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారన్నారు.అందులో ఆరులక్షల మందికి మాత్రమే ప్రభుత్వం అరకొరగా పింఛన్లు ఇస్తుందన్నారు. వికలాంగులు దుర్భర స్థితిలో బతుకుతున్నామన్నారు.న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబుకు పొర్లు దండాలు పెట్టామన్నారు.పాలాభిషేకాలు కూడా చేశామన్నారు. అయినా చంద్రబాబు మనసు కరగలేదన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు.వైయస్‌ జగన్‌ను స్పందిస్తూ దివ్యాంగులను మానవీయ కోణంలో ఆదుకోవాలన్నారు.అధికారంలోకి వచ్చిన అన్ని కేటగిరి దివ్యాంగులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Back to Top