‘అవిశ్వాసానికి’ మద్దతివ్వలేదేం: మైసూరా

హైదరాబాద్: టైమ్సు నౌ చానల్ సర్వేపై ‌టిడిని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంత ధీమా ఉంటే.. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయలేదని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆయన బుధవారం  మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగితే టిడిపికి పుట్టగతులు ఉండవనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకుండా పారిపోయారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ‘టైమ్సు నౌ’ సర్వే ప్రజలు నమ్మేదిగా లేదన్నారు. ఆ సర్వేకు శాస్త్రీయత పూర్తిగా లోపించిందని, ఇష్టానుసారంగా అంకెలు వేశారని, దీన్ని చూస్తేనే నవ్వొస్తోందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 30కి పైగా లోక్‌సభ స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని మైసూరా ధీమాగా చెప్పారు.
Back to Top