మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి తో సహా పలువురి హౌజ్ అరెస్టు

వైయస్‌ఆర్‌ జిల్లాః  జిల్లాలో ప్రతిపక్ష నాయకులపై పోలీసులు మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారు. వివిధ కార్యక్రమాల్లోపాల్గొనాల్సి ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ ఎంపి అవినాష్ రెడ్డి తో పాటుపార్టీ సీనియర్ నాయకులైన సురేష్ బాబు, దేవిరెడ్డి శంకరరెడ్డి తదితరులను బుధవారం ఉదయమే హౌజ్ అరెస్టు చేశారు. ముందు నిర్దేశించుకున్న ప్రకారం వీరంతా జమ్మలమడుగు నియోజకవర్గంలో గోరిగనూరులో  , వివిధ పార్టీల నుంచి వైయస్ఆర్ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆది నారాయణరెడ్డి ప్రాబల్యం ఉన్న ప్రాంతమనీ, అందుకని గోరిగ నూరులో ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించి వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Back to Top