పోలీసులు వేధింస్తున్నారన్నా..


వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆటోడ్రైవర్ల మొర..
శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను ఆటోడ్రైవర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.డీజీల్,స్పెయర్‌ పార్ట్స్‌ ధరలు, ఇన్సూ్యరెన్స్‌ప్రీమియం పెరిగిపోవడంతో అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. నలుగురు మించి ప్రయాణికులకు ఎక్కించుకుంటే జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఓవర్‌లోడింగ్‌ పేరుతో  కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అప్పులు చేసి ఆటోలను కొనుగోలు చేసి రోడ్డుపైకి రాకపోతే మా  కుటుంబసభ్యులను ఎలా పోషించుకోవాలని పశ్నించారు. తెల్లవారు నుంచి భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆటోడ్రైవర్లు గురించి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తమకు ఏటా రూ.10వేలు ఇస్తామన్న వైయస్‌ జగన్‌ హామీ పట్ల ఆటోడ్రైవర్లు  హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరుకూ ఏ నాయకుడు కూడా ఆటోడ్రైవర్లు గురించి ఆలోచించలేదని, ఒక్క వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే తమ గురించి ఆలోచించడం చాలా ఆనందంగా ఉందన్నారు.వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే మాకు మంచి జరగుతుందని నమ్ముతున్నామన్నారు.

Back to Top