హత్యాయత్నంపై చంద్రబాబు తీరు పద్దతి కాదు..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డిని లోటస్ పాండ్‌లోని ఆయన గృహంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పరామర్శించారు.జాగ్రత్తగా ఉండాలని వైయస్ జగన్‌ను సూచించారు. దేవుడు చాలా గొప్పవాడని, హత్యాయత్నం నుంచి జగన్ అదృష్టవశాత్తూ తప్పించుకున్నారని ఆయన తెలిపారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. చంద్రబాబు కుట్రను ఏపీ ప్రజలు గుర్తిస్తారన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యయత్నం జరిగితే బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కూ్రరమైన పద్దతిలో స్పందించిన తీరు దారుణమన్నారు. ఇలాంటి సమయాల్లో రాజకీయ విభేదాలు పక్కనపెట్టాలని కనీసం ఫోన్‌లో కూడా వైయస్ జగన్‌ను పరామర్శించకపోవడం పద్దతి కాదన్నారు. చంద్రబాబు సాటి మనిషిగా మానవత్వం ప్రదర్శించాలన్నారు.