ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదన్నా..

వైయస్‌ జగన్‌కు కలిసిన ఆరోగ్యమిత్రలు..
శ్రీకాకుళంః ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులర్‌ చేయడంలేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్‌ జగన్‌ను తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ సర్వీసులు క్రమబద్దీకరించాలని కోరుతూ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం సమర్పించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం అమలు చేయడంలేదని వాపోయారు.2007లో ఆరోగ్యమిత్రలుగా నియమితులయ్యామన్నారు. ఇప్పటి దాకా జీతాలు పెంపు, ఉద్యోగ భద్రతా  లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు.ఆరోగ్యమిత్రలను తొలగించాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఉద్యోగులందరూ హైకోర్టుకు వెళ్ళి గెలిచామన్నారు.ఆరోగమిత్రలను తొలగించాలని చూస్తున్నారే తప్ప మా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం అయితే మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు.
 
Back to Top