అరకులో వైయస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీ

అరకు:

సొసైటీ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌దే నైతిక విజయమని మాజీ ఎమ్మెల్యే, పార్టీ నాయకుడు కుంభా రవిబాబు అన్నారు. అరకు లోయ పీఏసీఎస్ ఎన్నిక వాయిదాను నిరసిస్తు అరకులోయలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, ఎన్నికలు వాయిదా సిగ్గు, సిగ్గు, కాంగ్రెస్ పార్టీ డౌన్, డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం వైయస్ఆర్ జంక్షన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. రవిబాబు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుదారుల విజయం ఖాయమన్నారు.  అరకులోయలో పార్టీ మద్దతుదారులు గెలుపొందుతారనే ఎన్నికను మంత్రి బాలరాజు వాయిదా వేయిం చారన్నారు. అరకు నియోజక వర్గం పరిధిలోని ఆరు సొసైటీల్లో కూడ పార్టీ మద్దతుదారులు విజయం సాధిస్తారన్నారు. రైతులను అవమాన పరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డికి అనుకూలంగా రైతులు ఉండడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top