ఏపీ ఆశాజ్యోతిని ఆర్పేశారు

తిరుపతి : రాష్ట్రంలో పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా  చంద్రబాబు తన సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతిలో భూమన నేతృత్వంలో నగర బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకుని ఆయన్ను స్టేషన్కు తరలించారు. భూమన అరెస్ట్పై పార్టీ నేతలు, కార్యకర్తలు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.  

అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. జరాసందుడి పాలనను చంద్రబాబు పాలన తలపిస్తోందని ఆరోపించారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని బాబు ఆపలేరని చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల ఆశా జ్యోతి అన్నారు. ఆ ఆశా జ్యోతిని చంద్రబాబు ఆర్పేశారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top