అవినీతి, హత్యల్లో బాబు ఏపీని నంబర్ వన్ చేశాడు

తూర్పుగోదావరిః అవినీతి, హత్యల్లో చంద్రబాబు ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాడని  వైయస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. ఆర్థికమంత్రి యనమల వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని చురక అంటించారు. మేనిఫెస్టోలోని హామీలను అమలు చేశామని మీ కార్యకర్తల ముందు గాకుండా ప్రజల ముందు చెప్పగలరా...? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని అసమర్థ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

Back to Top