ఈ నెల 16న ఏపీ బంద్‌

విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు పిలుపునిచ్చాయి. బంద్‌లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని వైయస్‌ఆర్‌సీపీ విజ్ఞప్తి చేసింది. పార్లమెంట్‌సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా, ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను గుర్తించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి మండిపడ్డారు. ఏపీ హక్కులను కాలరాస్తున్న తీరుకు నిరసనగా బంద్‌ చేపడుతున్నట్లు చెప్పారు.
 

తాజా వీడియోలు

Back to Top