జననేత చేతుల మీదుగా అన్నవస్తున్నాడు సీడీ ఆవిష్కరణ

శ్రీకాళహస్తిః  వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేతులమీదుగా శనివారం రేణిగుంట మండలంలోని కరకంబాడీ వద్ద అన్నవస్తున్నాడు పాటల సీడిని ఆవిష్కరించారు. వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి 6వతేది నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్పయాత్రను పురస్కరించుకుని పార్టీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సీడీలను తయారు చేయించారు. వాటిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీదర్శకుడు శ్రీనివాసులురెడ్డి, పార్టీ స్థానిక నాయకులు తీగల చిన్నారాయల్, నూలు జయశ్యామ్‌రాయల్, ముద్దు గురవయ్య యాదవ్,బాలు యాదవ్‌ తదితరులున్నారు. ఈసందర్భంగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ...అన్నవస్తున్నాడు పాటలు అద్భుతంగా ఉన్నాయని తెలియజేశారు.

Back to Top