అనిగండ్లపాడు నుంచి మొదలైన షర్మిల పాదయాత్ర

జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా), 20 ఏప్రిల్‌ 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పాదయాత్రకు కృష్ణాజిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శనివారం నాటికి 126వ రోజుకు చేరింది. శనివారం ఉదయం షర్మిల జగ్గయ్యపేట నియోజకవర్గం అనిగండ్లపాడు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి పెనుగంచిప్రోలు, మక్కపేట చేరుకుంటారు. శనివారం రాత్రికి శ్రీమతి షర్మిల మక్కపేటలోనే బసచేస్తారు. కాగా, శ్రీమతి షర్మిల ఈ రోజు 13.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
Back to Top