రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి హోదా పెంచుకుంటున్నారు..!

గుంటూరుః వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలంతా ప్రత్యేకహోదా కావాలని కోరుకుంటుంటే..చంద్రబాబు మాత్రం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి తన హోదా పెంచుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈనెల 26 నుంచి ప్రత్యేకహోదా సాధనకోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో బొత్స,రోజా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమై చర్చించారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించారని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలపై నేతలు నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ఒత్తిడితోనే అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై తీర్మానం చేశారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. హోదా గురించి చంద్రబాబు ఢిల్లీలో నోరుమెదకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top