'అనంత' పల్లెల్లో తొమ్మిదవ రోజు షర్మిల పాదయాత్ర

తుమ్మలక్రాస్‌ 26 అక్టోబర్ 2012: షర్మిల మరో ప్రజాప్రస్థానం తొమ్మిదవ రోజు పాదయాత్ర  శుక్రవారం అనంతపురంజిల్లా తుమ్మలక్రాస్‌నుంచి ప్రారంభం కానుంది. మల్లేనిపల్లి,
ధర్మవరం, శివానగర్‌, పేరు బజార్‌, అంజుమన్‌సర్కిల్‌, గాంధీనగర్‌,
గొల్లపల్లి మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుంది . ధర్మవరంలో పీ ఆర్ టీ సర్కిల్‌ వద్ద బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇందులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ
కూడా పాల్గొంటారు.
తొమ్మిదవ రోజు శుక్రవారం
షర్మిల ఉదయం పది గంటలకు తుమ్మల శివారులో గురువారం రాత్రి బస చేసిన ప్రాంతం
నుంచి తన పాదయాత్రను కొనసాగిస్తారు. మల్లేనిపల్లి మీదుగా ధర్మవరం చేరుకుంటారు. 
ధర్మవరంలో శివానగర్ సర్కిల్, తేరుబజారు, మెయిన్‌బజారు మీదుగా
అంజుమన్ సర్కిల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మూడు గంటలకు పీఆర్‌టీ
సర్కిల్‌కు చేరుకుంటారు. పీఆర్‌టీ సర్కిల్‌లో వైఎస్ విజయమ్మతో కలిసి షర్మిల బహిరంగసభలో పాల్గొంటారు. బహిరంగసభ ముగిసిన తర్వాత గాంధీనగర్ సర్కిల్ మీదుగా
గొల్లపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. గొల్లపల్లి క్రాస్‌కు సమీపంలో
శుక్రవారం రాత్రి బస చేస్తారని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్
తలశిల రఘురాం, ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ మీడియాకు తెలిపారు.


Back to Top