ప్రజలను దగా చేస్తున్న కిరణ్, బాబు

హైదరాబాద్:

సమైక్యాంధ్ర పేరుతో సీఎం కిరణ్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నిప్పులు చెరిగారు. అప్రజాస్వామికంగా జరుగుతున్న రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి చాంపియన్‌గా నిలుస్తున్నారని ఆయన అభివర్థించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.

తాడేపల్లిగూడెం ప్రజాగర్జన సభలో చంద్రబాబు నాయుడు సమైక్యం అన్న మాటే మాట్లాడలేదని రాంబాబు ఆక్షేపించారు. సోనియా గాడ్సే అయితే ఆమె చేతిలో తుపాకీ చంద్రబాబే అని అని ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ అధికారంలోకి రాదని అర్థమయ్యాక చంద్రబాబు నాయుడు సోనియాను విమర్శించేందుకు ఇప్పుడు శక్తిని కూడగట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు సోనియా కీలుబొమ్మలాగా వ్యవహరించారని తూర్పారపట్టారు. కానీ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన తొలి రోజు నుంచే శ్రీ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలపై నిర్విరామంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. అడ్డగోలుగా జరుగుతున్న రాష్ట్ర విభజనకు సోనియా, కిరణ్‌, చంద్రబాబే కారకులని దుయ్యబట్టారు. 16 నెలలు జైలులో ఉన్నప్పటికీ కూడా సోనియా మాఫియాను శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ధైర్యంగా ఎదిరించారని చెప్పారు. అసెంబ్లీలో విభజన బిల్లుకు సహకరించింది చంద్రబాబేనని ఆరోపించారు.

రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చింది చంద్రబాబే అని అంబటి గుర్తుచేశారు. వంశపారపర్యంగా పిచ్చి లక్షణాలు ఉన్నది నారా కుటుంబానికేనని, శ్రీ జగన్‌ను విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చంద్రబాబు ఎప్పుడైనా విప్ జారీచేశారా అని అంబటి ప్రశ్నించారు. తన ‌తొమ్మిదేళ్ల పరిపాలనలో చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని గుర్తుచేశారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని, ఆయన హామీలను ప్రజలు ఎవ్వరూ నమ్మరని అంబటి రాంబాబు చెప్పారు.

Back to Top